యేసువలె ఇల నేనుండెదను యేసువలెను
yeesuvale ila neenundedanu yeesuvalenu
యేసువలె ఇల నేనుండెదను యేసువలెను ||యేసువలె ఇల||
శుద్ధుడనై బ్రతుకు బద్ధుడనంచును శుద్ధుడనై యుండ శ్రద్ధ జూపుదు నేను ||యేసువలె ఇల||
భరియింపవలసిన భారంబుల్గల వెన్నొ భరియింప మిక్కిలి బలశాలినై నేను ||యేసువలె ఇల||
సాధింపవలెనెన్నొ సాహసకార్యంబుల్ సాధింపధైర్యాన సాగి పోవుదు నేను ||యేసువలె ఇల||
ధాత్రి నెల్లతోడ మైత్రినేనెరపుచు శత్రులకునుగూడ మిత్రు డనై నేను ||యేసువలె ఇల||
ఒరుల చింతలదీర్తు నుల్లాసమున గూర్తు పరమ ప్రేమతో నెపుడు పైకి జూతును నేను ||యేసువలె ఇల||
నా దివ్యజనకుడు నాకు ననుదినమును బోధింప వాక్యంబు బుద్ధితో నేర్తును ||యేసువలె ఇల||
వినిసంతసంబున ఘనుని యాజ్ఞలనెల్ల వెనువెంట జేసెద వినయంబున నేను ||యేసువలె ఇల||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.