యెహోవా భజన చేయండి పాప నరులారా యీ రీతి మరచి పోకండి ||యెహోవా భజన||
యేసు పేరిట ప్రార్ధనంబు మన దోసములను బోగొట్టను వెరవు భాసుర పరలోక సుఖము కోటి బాధలు మనకున్న సంతోషకరము ||యెహోవా భజన||
యేసు క్రీస్తును గొలువండి యేసు దాసులతో వాదము లాడకండి మోసపు దారి విడువండి దోష రాసుల నుర్విలోఁ జేసికొనకండి ||యెహోవా భజన||
జీవ రక్షకుని నమ్మండి నిత్య సేవలో మెలఁగక చెడిపోకండి భావించి యాత్మన్ వేఁడండి దేవ దేవుని నెడఁబాసి తెరవు విడకండి ||యెహోవా భజన||
మాయ లోకపు భ్రాంతుల్విడిచి మనుష్యాయువు భువిలోన జెల్లుటఁ దలఁచి మాయ మార్గము లెల్ల మరచి మోక్ష మార్గము మన మున మరవక తలఁచి ||యెహోవా భజన||
కాయము నొసఁగిన ప్రభుని యయిదు గాయంబు లాత్మలోఁ గానంగ రాదా ఆయు వస్థిర మని తెలిసి మీరు కాయ మాత్మయు నిపుడు కర్తకు నిచ్చి ||యెహోవా భజన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.