యెహోవా నా కాపరి లే మేమి గలుగదు తన మహా కృపతోఁ బ్రోచి నన్ను మనుపు నాతఁడే ||యెహోవా నా||
పచ్చికగల చోట్ల నను పరుండజేయుచుఁ గడు హెచ్చగు సౌఖ్యములు సదా యిచ్చు నాతఁడే ||యెహోవా నా||
శాంతికర జలములకు నను సాగజేయుచు విశ్రాంతి ప్రాణమున కొసంగు విభుఁడు అతఁడే ||యెహోవా నా||
గాఢాంధకారమైన లోయల గుండ బోయిన నే కీడుకు భయపడ నిఁక నా తోడు ఆయనే ||యెహోవా నా||
దుడ్డుకఱ్ఱతో శత్రువులఁ దరుమఁగొట్టుచుఁ దన దొడ్డ దండముతో నీతి దారిలో నడుపు ||యెహోవా నా||
అందరిలో నన్ను నెంచి యధిక ప్రేమతోఁ గడు విందు లొసఁగి తృప్తిపరుచు విభుఁడు ఆయనే ||యెహోవా నా||
ముఖము కళగా నుండునట్లు మంచితైలమున్ నా సఖుఁడు నాకుఁ బూయుచుండు సకల వేళలన్ ||యెహోవా నా||
బ్రదుకు దినము లన్నిట నాకు బంటులవలెనే నను వెదకి కృపా క్షేమములు నా వెంటవచ్చును ||యెహోవా నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.