యెహోవా నా మొఱ లాలించెను

yehoovaa naa morra laalinchenu

🎵 TG-016💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యెహోవా నా మొఱ లాలించెను దన మహా దయను నను గణించెను అహర్నిశల దీనహీనుఁడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవా నా||

1వ చరణం

పిశాచి గడిమిఁబడఁగొట్టెను దన వశాన నను నిలువఁ బెట్టెను ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల నిశాంతమునఁజేర్చి సేదఁదీర్చెను ||యెహోవా నా||

2వ చరణం

మదావళముఁ బోలు నామదిన్ దన ప్రదీప్త వాక్యాం కూశా హతిన్ యధేచ్చలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికిఁ జేర్చెను ||యెహోవా నా||

3వ చరణం

అనీతి వస్త్ర మెడలించెను యేసునాధు రక్తమున ముంచెను వినూత్న యత్నమె ద నూని యెన్నఁడు గనన్ వినన్ బ్రేమ నాకుఁ జూపెను ||యెహోవా నా||

4వ చరణం

విలాపములకుఁ జెవి నిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగము పైకిలాగి నను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను ||యెహోవా నా||

5వ చరణం

అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాఁ చక తెగించి మృతి కొప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నణంచెను ||యెహోవా నా||

Report Error