యెహోవా నాబలమా - యదార్ధమైనది నీ మార్గం
yehoovaa naabalamaa - yadaardhamainadi nee maargam
యెహోవా నాబలమా - యదార్ధమైనది నీ మార్గం పరి పూర్ణమైనది నీ మార్గం - యెహోవా....ఆ..ఆ
నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన - వదలక నను ఎడబాయని దేవా ||యెహోవా||
మరణపుటురులలో మరువక మొరలిడ - ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను - అదరెను ధరణి భయకంపముచే ||యెహోవా||
నాదిపమును వెలిగించువాడు - నా చీకటిని వెలుగుగా జేయును జలరాశుల నుండి బలమైన చేతితో - వెలుపల జేర్చిన బలమైన దేవుడు ||యెహోవా||
పౌరుషముగల ప్రభు కోపించగ - పర్వతములపునాదులు వణికెను తన నోటనుండి వచ్చిన అగ్ని - దహించి వేసెను వైరులనెల్ల ||యెహోవా||
మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగ జేయును ఉరుములు మెరుపులు మెండుగ జేసి - అపజయమిచ్చును అపవాదికిని ||యెహోవా||
దయగల వారిపై దయచూపించను - కటినుల యెడల వికటముజూపును గర్విష్టులయెక్క గర్వముననచును - సర్వము నెరిగిన సర్వాదికారి ||యెహోవా||
నా కాళ్లను లేడికాల్లగజేసి - ఎత్తైన స్థలములలో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి - అక్షయముగ తన పక్షము జేర్చిన ||యెహోవా||
యెహోవా జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడవు నీవే అన్యజనులలో ధన్యత చూపుచు - హల్లెలూయ స్తుతిగానము జేసెద ||యెహోవా||