♪♫
TG-1202
Telugu
యెహోవా నాకు వెలుగాయే యెహోవానాకు రక్షణయే
yehoovaa naaku velugaayee yehoovaanaaku rakssannayee
186
views
పల్లవి
యెహోవా నాకు వెలుగాయే యెహోవానాకు రక్షణయే నా ప్రాణ దుర్గమాయే - నేను ఎవరికి ఎన్నడు భయపడను (2)
1వ చరణం
నాకు మార్గమును ఉపదేశమును - ఆలోచన అనుగ్రహించే నేనెల్లప్పుడు ప్రభు సన్నిదిలో స్తుతి గానాము చేసెదను (2) ||యెహోవా||
2వ చరణం
నాకొండయు నాకోటయు - నా ఆశ్రయము నీవే (2) నేనెల్లప్పుడు ప్రభు సన్నిదిలో స్తుతి గానాము చేసెదను (2) ||యెహోవా||
3వ చరణం
నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను (2) ఆపత్కాలమున చేయి విడువకను - యెహోవా నన్ను చేరదీయును (2) ||యెహోవా||