యెహోవా నీ నామము ఎంతో బలమైనది
yehoovaa nee naamamu enthoo balamainadi
యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది ||యెహోవా||
మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి యెహోషువా ప్రార్ధించగా - సూర్య చంద్రుల నాపితివి ||యెహోవా||
నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి ||యెహోవా||
సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీహస్తము ||యెహోవా||
చెరసాలలో వేసినా - సంకెళ్ళు భిగియించినా సంఘము ప్రార్ధించగా - సంకెళ్లు విడిపోయెను ||యెహోవా||
పౌలు సీలను బందించి - చెరసాలలో వేసినా పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయె ||యెహోవా||
మానవుల రక్షణ కొరకై - నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా - ప్రకటించె నీప్రేమను ||యెహోవా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.