TG-3591
Telugu

యెహోవా యీరే - యెహోవా రాఫా

yehoovaa yeeree - yehoovaa raaphaa

J K Christopherపాస్టర్ స్ థామస్ · Pastor S Thomasఅమృత అడ్డాల సతీష్ బాబు అడ్డాల · Amrutha Addala, Satish Babu Addala
0
views
Chorus

యెహోవా యీరే - యెహోవా రాఫా యెహోవా నిస్సి - యెహోవా షాలోమ్ (2) నా పోషకుడా - నా పరమవైద్యుడా నా జయశీలుడా - నా సమాధానమా

పల్లవి పూర్వ భాగం

ఆ... ఆ... ఆ... హల్లెలూయ ఓ...ఓ...ఓ... ఆమెన్ ఆమెన్ (2)

1వ చరణం

పోషక కేంద్రాలుగా - ప్రకృతియే మారెనా (2) కలతేల ఈ కరువులో - కాకోలముల దైవమా (2) పండుగె నాకు - ఈ ప్రకృతి లో యెహోవా యీరే - నా ఆహారమా (2) యెహోవా యీరే - నా ఆహారమా ||ఆ... ఆ... ఆ... హల్లెలూయ||

2వ చరణం

ఆరోగ్య కేంద్రాలుగా - నీ గాయాలే మారెనా (2) అణువణువు స్తుతియింతును - నా తనువు పులకించగా (2) పండుగె నాకు - నీ గాయాలలో యెహోవా రాఫా - నా ఆరోగ్యమా (2) యెహోవా రాఫా - నా ఆరోగ్యమా ||ఆ... ఆ... ఆ... హల్లెలూయ||

3వ చరణం

నా విజయ కేంద్రాలుగా - నీ రక్తమే మారెనా (2) భూజనులలో నీకొక- రాజ్యమై జీవింతును (2) పండుగె నాకు - నీ రక్తము లో యెహోవా నిస్సి - నా గొర్రె పిల్ల (2) యెహోవా నిస్సి - నా గొర్రె పిల్ల ||ఆ... ఆ... ఆ... హల్లెలూయ||

4వ చరణం

నా శాంతి కేంద్రాలుగ - నీ సిలువ శ్రమలాయెనా (2) నీ స్వంత కుటుంబమై - నీ భారమును మోసెదా (2) పండుగె నాకు- నీ సిలువలో యెహోవా షాలోమ్ - నా సమాధానమా (2) యెహోవా షాలోమ్ - నా సమాధానమా ||ఆ... ఆ... ఆ... హల్లెలూయ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.