♪♫
TG-5618
Telugu
యెహోవాయే నా బలము యెహోవాయే నా శైలము
Yehoovaayee Naa Balamu Yehoovaayee Naa Shailamu
0
views
పల్లవి
యెహోవాయే నా బలము - యెహోవాయే నా శైలము యెహోవాయే నా కోటయు - యెహోవాయే నా కేడెము అ.ప: యెహోవాయే నా శృంగము - యెహోవాయే నా దుర్గము ||యెహోవాయే||
1వ చరణం
నా దీపము ఆరనీయక - నన్ను వెలిగించెను నా అడుగులు తడబడకుండా - నన్ను నడిపించెను నా చేతులు యుద్ధము చేయ- నాకు నేర్పించెను నా పక్షమున తానేయుండి - నన్ను గెలిపించెను ||యెహోవాయే||
2వ చరణం
నాకు బలము అనుగ్రహించి - నన్ను దృఢపరిచెను నా శత్రువులకంటె నన్ను బహుగా - తానే హెచ్చించెను నా జనులను నాకు లోపరచి - నన్ను ఘనపరచెను ముందుగా తానే నడచి - నన్ను నడిపించెను ||యెహోవాయే||