TG-4423
Telugu

యెహోవ నా ఆశ్రయ

Yehova Naa Aashrayam

0
views
పల్లవి

యెహోవ నా ఆశ్రయం నా విమోచన దుర్గము (2) నా ధ్యానం నా గానం యెహోవ నా అతిశయం (2) ||యెహోవ||

1వ చరణం

తన ఆలయాన నా మోర వినెను భూమి కంపించేలా ఘర్జన చేసెను మేఘాలు వంచి ఎగిరి వచ్చి జలరాసులనుండి నన్ను లేపెను ఆయనకు ఇష్టుడను – అందుకే నన్ను తప్పించెను ఆయనలో నా స్వాస్థ్యము – ఎంత మహిమోన్నతమైనది ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2) హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4) ||యెహోవ||

2వ చరణం

నా చేతి వేళ్ళకు సమరము నేర్పెను నా గుండెకు శౌర్యము నేర్పెను జయము నాకు జన్మ హక్కు ఆత్మాభిషేకము నా అగ్ని స్వరము శత్రువుల గుండెలలో – యేసు రక్తము సింహ స్వప్నము ఏ యుద్ధ భూమైనాను – యేసు నామం సింహనాదం ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2) హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4) ||యెహోవ||