♪♫
TG-4424
Telugu
యెహోవ నా మొర
Yehova Naa Mora
0
views
పల్లవి
యెహోవ నా మొర లాలించెను దన మహా దయను నను గనించెను అహర్నిశల దీనహీనుడగు నా దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవ||
1వ చరణం
పిశాచి గడిమి బడగొట్టెను దన వశాన నను నిలువ బెట్టెను ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల నిశాంతమున జే ర్చి సేద దీర్చెను ||యెహోవ||
2వ చరణం
మదావలము బోలు నా మదిన్ దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్ యధేచ్చలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను ||యెహోవ||
3వ చరణం
అనీతి వస్త్ర మెడలించెను యే సునాథు రక్తమున ముంచెను వినూత్న యత్నమే ద నూని యెన్నడు గనన్ వినన్ బ్రే మ నాకు జూపెను ||యెహోవ||
4వ చరణం
విలాపములకు జెవి నిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగము పై కిలాగి నను సుఖ కళావళుల్ మన సులోన నిలిపెను ||యెహోవ||
5వ చరణం
అగణ్య పాపియని త్రోయక న న్ను గూర్చి తన సుతుని దా చక తెగించి మృతి కొ ప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను ||యెహోవ||