♪♫
TG-4425
Telugu
యెహోవా దయాళుడు సర్వ
Yehovaa Dayaaludu Sarva
18
views
పల్లవి
యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు ఆయన కృప నిత్యముండును (2) ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు (2) యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు జై జై యేసు రాజా – జయ యేసు రాజా (4) ||యెహోవా||
1వ చరణం
సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే (2) ||యెహోవా నాకు||
2వ చరణం
దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనే విలువైన రక్షణలో నను కడ వరకు నడిపించు వారాయనే (2) ||యెహోవా నాకు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.