TG-4427
Telugu

యెహోవా మా కాపరి

Yehovaa Maa Kaapari

0
views
పల్లవి

యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి మాకు లేనిది లేదు లేమి కలుగదు (2) ||యెహోవా||

1వ చరణం

వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2) మా ప్రాణములు సేదదీర్చేను నీతి మార్గమున నడిపించెను ||యెహోవా||

2వ చరణం

కారు చీకటిలో కన్నీరు తుడిచెను మరణ పడకలో ఊపిరి పోసెను (2) మా తోడు నీడై నిలిచి నడచెను శత్రు పీఠమున విందు చేసెను ||యెహోవా||

3వ చరణం

పరిశుద్ధాత్మలో ముంచి వేసెను పరమానందము పొంగిపోయెను (2) పరలోకములో గొరియపిల్లను నిరతము మేము కీర్తింతుము ||యెహోవా||