యెహోవా నా బలమా
Yehovaa Naa Balamaa
యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం (2) ||యెహోవా||
నా శత్రువులు నను చుట్టిననూ నరకపు పాశములరికట్టిననూ (2) వరదవలె భక్తిహీనులు పొర్లిన (2) విడువక నను ఎడబాయని దేవా (2) ||యెహోవా||
మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2) తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2) ఆదరెను ధరణి భయకంపముచే (2) ||యెహోవా||
నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును (2) జలరాసులనుండి బలమైన చేతితో (2) వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) ||యెహోవా||
పౌరుషముగల ప్రభు కొపింపగా పర్వతముల పునాదులు వణకెను (2) తన నోటనుండి వచ్చిన అగ్ని (2) దహించివేసెను వైరులనెల్లన్ (2) ||యెహోవా||
మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును (2) ఉరుముల మెరుపుల మెండుగ జేసి (2) అపజయమిచ్చును అపవాదికిని (2) ||యెహోవా||
దయగలవారిపై దయ చూపించును కఠినులయెడల వికటము జూపును (2) గర్విష్టుల యొక్క గర్వమునణుచును (2) సర్వమునెరిగిన సర్వాధికారి (2) ||యెహోవా||
నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి (2) రక్షణ కేడెము నాకందించి (2) అక్షయముగ తన పక్షము జేర్చిన (2) ||యెహోవా||
యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే (2) అన్యజనులలో ధన్యత చూపుచు (2) హల్లెలూయ స్తుతిగానము చేసెద (2) ||యెహోవా||