TG-4434
Telugu

యెహోవా నను కరుణించుమా

Yehovaa Nanu Karuninchumaa

24
views
పల్లవి

యెహోవా నను కరుణించుమా నా దేవా నను దర్శించుమా (2) ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను వేకువనే నీ కృప కొరకు కనిపెడుతున్నాను దినమంతయు నేను ప్రార్ధించుచు ఉన్నాను ||యెహోవా||

1వ చరణం

విచారము చేత నా కన్నులు గుంటలై వేదన చేత నా మనస్సు మూగదై (2) నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2) ||దినమంతయు||

2వ చరణం

అవమానము చేత నా గుండెలో గాయమై (నడి) వంచన చేత నా ఊపిరి భారమై (2) నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2) ||దినమంతయు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.