♪♫
TG-4437
Telugu
యెహోవా నిస్సీ
Yehovaa Nissy
0
views
పల్లవి
యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ – అనుచు పాడెదం మా ధ్వజము విజయ ధ్వజమే (2) యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ (2) ||యెహోవా||
1వ చరణం
ప్రభువే ముందు నిలిచి యుద్ధం చేయును కలత చెంద కారణమే లేదుగా సడలకుండ కరముల కాధారమై శక్తి గల యేసు ఆత్మ నిలుపును (2) సర్వ సైన్య అధిపతి ప్రభువే (2) ||యెహోవా||
2వ చరణం
మనయందున్నట్టి బలము చాలును నాధుడేసు సెలవిచ్చెను పోదము ఆయుధములు భుజబలమవసరమా పరమ దేవునాత్మ మనలో నుండగా (2) మనము దైవ సైన్యమేగదా (2) ||యెహోవా||
3వ చరణం
హల్లెలూయ స్త్రోత్తమే మన ఆయుధం యేసు నామ శక్తే సామర్ధ్యము యేసు రాక వరకే పోరాటము జయము పొందుటే జీవిత ధ్యేయము (2) సిలువే మన జయ పతాకము (2) ||యెహోవా||