♪♫
TG-4440
Telugu
యెహోవాను సన్నుతించెదన్
Yehovaanu Sannuthinchedan
0
views
పల్లవి
యెహోవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను ప్రభువును ఘనపరచెదన్ ఆ నామమునే గొప్ప చేసెదన్ (2) హల్లెలూయా హల్లెలూయా (2) ||యెహోవాను||
1వ చరణం
నాకున్న సర్వము నన్ను విడచినను నావారే నన్ను విడచి నిందలేసినను (2) నా యేసయ్యను చేరగా నేనున్నానన్నాడుగా (2) ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగయుగములు చెల్లును (2) ||యెహోవాను||
2వ చరణం
నాకున్న భయములే నన్ను కృంగదీయాగా నా హృదయం నాలోనే నలిగిపోయేగా (2) నా యేసయ్యను చేరగా నన్నాదరించెనుగా (2) ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగయుగములు చెల్లును (2) ||యెహోవాను||
3వ చరణం
నా ఆశలే నిరాశలై నిస్పృహలో ఉండగా నాపైన చీకటియే నాన్నవరించెగా (2) నా దీపము ఆరుచుండగా నా యేసయ్య వెలిగించెగా (2) ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగయుగములు చెల్లును (2) ||యెహోవాను||