యెహోవాను స్తుతియించ
Yehovaanu Sthuthiyinchu
యెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచు మహా దేవుని సేవించు – యేసుని పూజించు (2) ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన నిత్యుడగు తండ్రి (2) సమాధానకర్త అయిన రారాజును ఆత్మతోను సత్యముతోను – బలముతోను మనసుతోను కరములు తట్టి కేకలు వేసి – గంతులు వేసి నాట్యము చేసి కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతియించు ||యెహోవాను||
ఆకాశ మహిమలు ఆయనను స్తుతియించు భూలోక సంపూర్ణత ఆయనను స్తుతియించు తన చేతి క్రియలన్ని ఆయనను స్తుతియించు పిల్లనగ్రోవితో ఆయనను స్తుతియించు నీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో ||ఆత్మతోను||
స్వరమండలముతో ఆయనను స్తుతియించు సితార స్వరములతో ఆయనను స్తుతియించు గంభీర ధ్వనితో మ్రోగెడి తాళముతో తంబుర నాట్యముతో తంతి వాద్యముతో జీవమున్న ప్రతి ప్రాణి ఆయనను స్తుతియించు ||ఆత్మతోను||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.