TG-4442
Telugu

యెహెూవాయే నా బలము

Yehovaaye Naa Balamu

26
views
పల్లవి

యెహెూవాయే నా బలము యెహెూవాయే నా శైలము (2) యెహెూవాయే నా కోటయు యెహెూవాయే నా కేడెము యెహెూవాయే నా శృంగము యెహెూవాయే నా దుర్గము (2) ||యెహెూవాయే||

1వ చరణం

నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను (2) నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను నా పక్షమున తానేయుండి నన్ను గెలిపించెను (2) ||యెహెూవాయే||

2వ చరణం

నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరిచెను నా శత్రువులకంటె నన్ను బహుగా తానే హెచ్చించెను (2) నా జనులకు నాకు లోపరచి నన్ను ఘనపరచెను నా ముందుగా తానే నడచి నన్ను బలపరచెను (2) ||యెహెూవాయే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.