TG-4446
Telugu

యేసన్న స్వరమన్

Yesanna Swaramannaa

0
views
పల్లవి

యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా (2) ||యేసన్న||

1వ చరణం

ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచె (2) యెహోవా ఎదుటను ఆదాము దాగిన (2) అటులనే నీవును దాగెదవా (2) ||యేసన్న||

2వ చరణం

జనముల శబ్దము జలముల శబ్దము బలమైన ఉరుములతో (2) కలిసిన స్వరము పిలిచిన యేసు (2) పిలిచిన పిలుపును నీవింటివా (2) ||యేసన్న||

3వ చరణం

ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము (2) ఈనాడు నీవును ఈ స్వరము వినగా (2) కానాను చేరగా కదిలి రావా (2) ||యేసన్న||