TG-4449
Telugu

యేసయ్య మాట విలువైన

Yesayya Maata Viluvaina

19
views
పల్లవి

యేసయ్య మాట విలువైన మాట వినిపించుకోవా సోదరా వినిపించుకోవా సోదరీ (2) నీ గుండెలోన ముద్రించుకోవా ఏ నాటికైనా గమనించలేవా గమనించుము పాటించుము ప్రచురించుము నిన్నూవలె నీ పొరుగువారిని ప్రేమించమని ప్రేమించమని ||యేసయ్య||

1వ చరణం

ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులని చెప్పిన మాట నీతివిషయమై ఆకలిగొనువారు ధన్యులని చెప్పిన మాట కనికరము గలవారు – హృదయశుద్ది గలవారు (2) సమాధానపడువారు – సాత్వికులు ధన్యులని (2) దుఃఖపడువారు ధన్యులని చెప్పిన మాట ||యేసయ్య||

2వ చరణం

నరహంతకులు కోపపడువారు నరకాగ్నికి లోనగుదురని అపహారకులు వ్యభిచరించువారు నరకములో పడిపోదురని కుడిచెంప నిను కొడితే – ఎడమ చెంప చూపుమని (2) అప్పడుగగోరువారికి నీ ముఖము త్రిప్పకుము (2) నీ శత్రువులను ద్వేషించక ప్రేమించమని ||యేసయ్య||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.