♪♫
TG-4458
Telugu
యేసయ్యా నా హృదయ
Yesayyaa Naa Hrudaya
0
views
పల్లవి
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2) విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా||
1వ చరణం
నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారెనే (2) నీవు నడిపించిన రోజున యుగయుగాల తలపు మది నిండెనే (2) యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా||
2వ చరణం
నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే (2) నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2) నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా||
3వ చరణం
నీవు వరునిగా విచ్చేయి వేళ నా తలపుల పంట పండునే (2) వధువునై నేను నిను చేరగా యుగయుగాలు నన్నేలు కొందువనే (2) యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||