TG-4459
Telugu

యేసయ్యా నా ప్రాణనాథా

Yesayyaa Naa Praana

0
views
పల్లవి

యేసయ్యా నా ప్రాణనాథా నిను ఆడి పాడి కీర్తించెదను నీవే నా జీవదాత అని లోకమంతా చాటించెదను ||యేసయ్యా||

1వ చరణం

సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వలోకమును సృష్టించిన సుందరుడా (2) స్తుతి మహిమా ఘనతా నీకే అని సంతసించి స్తోత్రించెదను ||యేసయ్యా||

2వ చరణం

పాపమే ఎరుగని నీతిమంతుడా పాపిని రక్షించిన నీతిసూర్యుడా (2) పరిశుద్ధ పరలోక తండ్రి అని పరవశించి నే పాడెదను ||యేసయ్యా||

3వ చరణం

ఆది అంతమైన అల్ఫా ఒమేగా మేఘముపై రానున్న మహిమోన్నతుడా (2) ఉన్నవాడవు అనువాడవు నీవని ఉల్లసించి ఆరాధింతును ||యేసయ్యా||