♪♫
TG-4462
Telugu
యేసయ్యా నా యేసయ్యా
Yesayyaa Naa Yesayyaa
27
views
పల్లవి
యేసయ్యా నా యేసయ్యా నాపై నీకెందుకింత ప్రేమయ్యా (2) నా పాపములను క్షమియించినావయ్యా నా దోషమును భరియించినావయ్యా నీ ప్రేమకు కొలతే లేదయ్యా నా దాగు చోటు నీవయ్యా (2) ||యేసయ్యా||
1వ చరణం
ఆజ్ఞను వినని అవిధేయత నీ సన్నిధి నుండి తొలగించనీ (2) ఉపద్రవములు నన్ను చుట్టుకొనగా ఉపకారిగా నను చేర్చుకొంటివయ్యా (2) ||యేసయ్యా||
2వ చరణం
లోకపు ఆశతో నిండియుండగా జీవపు ఢంబము మదిని చేరగా (2) చెడిపోయి నేను తిరిగి రాగా నా రాకకై దారిలో వేచియుంటివి (2) ||యేసయ్యా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.