TG-4492
Telugu

యేసు నాథా దేవా

Yesu Naathaa Devaa

0
views
పల్లవి

యేసు నాథా దేవా వందనాలు రాజా.. వందనాలు రాజాధి రాజా నీకే వందనాలు రవి కోటి తేజా నీకే వందనాలు (2) ||యేసు నాథా||

1వ చరణం

పాపిని కరుణించి ప్రాణ దానమిచ్చావు పరమ జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి (2) పన్నెండు గుమ్మముల… పట్టణమే నాకు కట్టిపెట్టినావా ||రాజాధి రాజా||

2వ చరణం

నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు నీ నీతి నాకిచ్చి నిత్య రాజ్యమిచ్చావు (2) నీ నీతి నీ రాజ్యం… నిండైన నా భాగ్యమే ||రాజాధి రాజా||

3వ చరణం

హీనుని దీవించి ఘనునిగా చేసావు నీ రుధిరమే కార్చి నా ఋణము దీర్చావు (2) నా సల్లనయ్యా… నా యన్న నీవే నా యేసయ్యా ||రాజాధి రాజా||

4వ చరణం

కన్ను మిన్ను గానకుండా నిన్ను మీరిపోయాను చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు (2) నీ మనసే వెన్నయ్యా… నా కన్న తండ్రి నా యేసయ్యా ||రాజాధి రాజా||