TG-4493
Telugu

యేసూ నన్ ప్రేమించితివి

Yesu Nan Preminchthivi

0
views
పల్లవి

యేసూ నన్ ప్రేమించితివి ఆశ్రయము లేనప్పుడు – నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే (2) ||యేసూ||

1వ చరణం

నే తలచలేదెప్పుడు – నా అంతమేమౌనని (2) నా పాపములచే నేను నిన్ను విసిగించితిని ||యేసూ||

2వ చరణం

నిన్ను నే గాంచగానే – నా జీవితము మారెను (2) నీయందు గృచ్చబడి నిన్నంగీకరించితి ||యేసూ||

3వ చరణం

రక్షణ దొరికే నాకు – రక్తముతో నన్ను కడిగి (2) క్రయముగా నీ చెంతకు రక్షకా తెచ్చితివి ||యేసూ||