యేసు నీ నామామృతము
yeesu nee naamaamrutamu
యేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా (2) దేవ మా – దోషములను హరించి మోక్షని వాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన ||యేసు||
వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి (2) దేవ యెంతో – కీడు జేసిన పాడు వైరిని గోడుగో డనంగ వాని – తాడనము జేసితివి ||యేసు||
పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా (2) దేవ నీ – దాపు జేరిన వారి కందరి కాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు ||యేసు||
అక్షయ కరుణేక్ష భువన – రక్షకా నీవే (2) దేవ మమ్ము పక్షముగ రక్షించి మోక్షసు రక్షణకు దీక్ష గొని – వీక్షితులమైన మాకు ||యేసు||
అందమగు నీ మందిరమున – బొందుగా మేము (2) దేవ నీ – సుందర కరుణామృతము మా డెందముల యందు గ్రోలు – టందుకు సుందరమైన ||యేసు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
