TG-4496
Telugu

యేసు నీ స్వరూపమున

Yesu Nee Swaroopamunu

0
views
పల్లవి

యేసు నీ స్వరూపమును నేను చూచుచు (2) నీ పోలికగా నేను మారేదన్ (2) ||యేసు||

1వ చరణం

యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి దాసుని రూపము ధరించి దీనుడైతివి (2) నేను దీనుడను కాను గర్వముతో నిండియున్నాను నీదు వినయముతో నింపుము (2) ||యేసు||

2వ చరణం

ప్రేమగల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి నీ ప్రేమ ద్వారనే సమస్తము నిచ్చితివి (2) నీ ప్రేమ చూపలేను కఠినుడనైయున్నాను నీ ప్రేమతో నింపుము (2) ||యేసు||

3వ చరణం

యేసు నీ స్వరూపము కలిగి ఆయన వాలే మారెదన్ నీ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్ (2) ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము నీ పవిత్రతతో నింపుము (2) ||యేసు||