TG-4498
Telugu

యేసు నీకే జయం జయమ

Yesu Neeke Jayam Jayamu

23
views
పల్లవి

యేసు నీకే జయం జయము (2) నీవే లోక పాలకుడవు (2) సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక రక్షకుడవు (2) జై జై అనుచు నీకే పాడెదం (2) జన్మించె జగమున మానవ రూపములో ప్రాయశ్చిత్తముకై తానే బలియాయె (2) పాపియైన మాన-వుని రక్షింప సిలువ నెక్కి తన ప్రాణము నిచ్చెన్ (2) హల్లెలూయా భువిపైన (2) ||యేసు||

1వ చరణం

మరణము ద్వారా – అంతమాయె బలులు తన సమాధి సర్వం కప్పెన్ (2) తిరిగి లేచుటచే సర్వం నూతనమాయె సంపూర్ణముగ ఓడిపోయె మృత్యు సమాధి (2) హల్లెలూయా భువిపైన (2) ||యేసు||

2వ చరణం

స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతమొందెన్ తండ్రి కుడిప్రక్కన ఆయన కూర్చుండెన్ (2) రాజుల రాజై ప్రభువుల ప్రభువై పొందె అధికారము – పరలోకముపై (2) హల్లెలూయా భువిపైన (2) ||యేసు||

3వ చరణం

తన రూపమునకు మార్పు నిష్ట-మాయె సృష్టికంటె ముందు తానే సంకల్పించె (2) లోక దుఃఖము నుండి – మనం తప్పించుకొని తన రూపము నొంది – తనతో నుండెదం (2) హల్లెలూయా భువిపైన (2) ||యేసు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.