TG-4504
Telugu

యేసూ ప్రభుని స్తుతించుట

Yesu Prabhuni Sthuthinchuta

0
views
పల్లవి

యేసూ ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది (2) మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||

1వ చరణం

విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||

2వ చరణం

ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మేము చేసెను (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||

3వ చరణం

మా శైలము మా కేడెము మా కోటయు మా ప్రభువే (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||

4వ చరణం

ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన దేవుడు (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||

5వ చరణం

అతిసుందరుడు అందరిలోన అతికాంక్షనీయుడు అతి ప్రియుడు (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||

6వ చరణం

రాత్రింబవళ్లు వేనోళ్లతోను స్తుతించుటయే బహుమంచిది (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||