TG-4506
Telugu

యేసు ప్రభువే

Yesu Prabhuve

0
views
పల్లవి

యేసు ప్రభువే – సాతాను బలమును జయించెను అందరము – విజయ గీతములు పాడెదము విజయ గీతములు పాడెదము మన శ్రమలలో విజయమునిచ్చెన్ తన రాజ్యమునందు మనలను చేర్చును (2) ఘన విజయమును మనకై పొందెన్ (2) మన విజయము యేసే అని హర్షించెదము (2) ||యేసు||

1వ చరణం

మనమాయన సంఘముగా తన రక్తము ద్వారా సమకూర్చెను (2) సంఘమునకు శిరస్సాయనే (2) సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము (2) ||యేసు||

2వ చరణం

మహోన్నతుడు మహా ఘనుడు మహిమ రాజు మనకు విజయమునిచ్చే (2) మరణము గెల్చి తిరిగి లేచే (2) ఆర్భాటముతో హర్షించెదము (2) ||యేసు||