యేసు రాజుగా వచ్చుచున్నాడ
Yesu Raajugaa Vachchuchunnaadu
యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకొంటారు (2) రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2) రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు||
మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2) లోకమంతా శ్రమకాలం (2) విడువబడుట బహుఘోరం ||యేసు||
ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2) ఈ సువార్త మూయబడున్ (2) వాక్యమే కరువగును ||యేసు||
వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2) నీతి శాంతి వర్ధిల్లును (2) న్యాయమే కనబడును ||యేసు||
ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2) వంగని మోకాళ్ళన్నీ (2) యేసయ్య యెదుట వంగిపోవును ||యేసు||
క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2) రెప్ప పాటున మారాలి (2) యేసయ్య చెంతకు చేరాలి ||యేసు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.