♪♫
TG-4516
Telugu
యేసు రక్తము రక్తము
Yesu Rakthamu Rakthamu
0
views
పల్లవి
యేసు రక్తము రక్తము రక్తము (2) అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము||
1వ చరణం
ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము (2) బహు దు:ఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము||
2వ చరణం
మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము (2) మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను (2) ||యేసు రక్తము||
3వ చరణం
మహా పరిశుద్ద స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము (2) మన ప్రధాన యాజకుడు మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము||