TG-4517
Telugu

యేసు రక్తములో

Yesu Rakthamulo

0
views
పల్లవి

యేసు రక్తములో నాకు జయమే జయము ప్రభు యేసు రక్తములో నిత్యం విజయం (2) జయం జయం జయం జయం – నా యేసునిలో జయం జయం జయం జయం – ప్రభుయేసు రక్తములో (2) ||యేసు రక్తములో||

1వ చరణం

పాపాలను క్షమియించి – శాపాలను భరియించి విడుదలను కలిగించే యేసు రక్తము మరణాన్ని తొలగించి – నరకాన్ని తప్పించి పరలోకానికి చేర్చే యేసు రక్తము (2) అమూల్యమైనది పవిత్రమైనది ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం||

2వ చరణం

శోధనలలో జయమిచ్చి – బాధలో నెమ్మదినిచ్చి ఆదరణను కలిగించే యేసు రక్తము రోగాలను లయపరచి – వ్యాధులను దూరం చేసి స్వస్థత నాకు చేకూర్చే యేసు రక్తము (2) అమూల్యమైనది పవిత్రమైనది ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం||