♪♫
TG-4518
Telugu
యేసు సర్వోన్నతుడా
Yesu Sarvonnathudaa
22
views
పల్లవి
యేసు సర్వోన్నతుడా… క్రీస్తు సర్వశక్తిమంతుడా…. యేసు సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మానవుల రక్షించే మహా దేవుడా (2) నశియించినదానిని వెదకి రక్షించినావా (2) చితికిన బ్రతుకుల కన్నీరు తుడిచినావా (2) వందనమయ్యా నీకు వందనమయ్యా యేసయ్యా.. వందనమయ్యా నీకు వందనమయ్యా (2) కానాను పురమున కళ్యాణ సమయాన (2) నీటిని ద్రాక్షా రసముగ మార్చి విందును పసందుగా మార్చినావు (2) ||వందనమయ్యా||
1వ చరణం
నాయీను గ్రామాన విధవరాలి కుమారుని (2) పాడెను ప్రేమతో ముట్టి కన్నతల్లి కన్నీరు తుడిచినావు (2) ||వందనమయ్యా||
2వ చరణం
గెరాసేను దేశాన సమాధుల స్థలములోన (2) సేన దయ్యమును వదిలించి నశియించే ఆత్మను రక్షించినావు (2) ||వందనమయ్యా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.