TG-4527
Telugu

యేసుని నామములో

Yesuni Naamamulo

0
views
పల్లవి

యేసుని నామములో – మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమొచ్చును మృతులకు నిండు జీవమొచ్చును హృదయములో నెమ్మదొచ్చును యేసు రక్తముకే – యేసు నామముకే యుగయుగములకూ మహిమే అభిషిక్తులగు తన దాసులకు ప్రతి సమయమునా జయమే ||యేసుని||

1వ చరణం

ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసనపరులైనా ఆర్ధికముగా లోటులెన్నున్నా ఆశలు నిరాశలే ఐనా ప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవు పరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు ||యేసు రక్తముకే||

2వ చరణం

రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా శ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నా నీ స్థితి నేడేదైనా – నిత్యజీవము పొందెదవు ||యేసు రక్తముకే||