యూదా గోత్రపు సింహమా మా కొరకే వచ్చిన దైవమా
Yoodaa Goothrapu Sinhamaa Maa Korakee Vachchina Daivamaa
యూదా గోత్రపు సింహమా మా కొరకే వచ్చిన దైవమా రాజులకు రారాజు రక్షకుడై జన్మించెను మహిమ గల మహారాజు మానవుడై దిగివచ్చెను (2) సంబరమాయే ఈ జగమంతా సందడి చేసే ఈ జనులంతా (2) హల్లెలూయ హల్లెలూయ హ్యాపీ Christmas హల్లెలూయ హల్లెలూయ Merry Christmas (2) ||రాజులకు||
బేత్లెహేము పురములో కన్య మరియ గర్భములో (2) జన్మించెను దేవ దేవుడు - ఉదయించెను నీతిసూర్యుడు (2) ||సంబరమాయే||
పాపములను క్షమియించుటకు నీతి మార్గములలో నడిపించుటకు (2) జన్మించెను నీతిమంతుడు దిగివచ్చెను అధ్వితీయుడు (2) ||సంబరమాయే||
తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వ్యాధి బాధలను తొలగించుటకు (2) జన్మించెను పరమ వైద్యుడు ఏతెంచెను యేసు దేవుడు (2) ||సంబరమాయే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.