TG-5616
Telugu

యూదుల రాజని యేసుని కొలువండి

Yoodula Raajani Yeesuni Koluvandi

0
views
పల్లవి

యూదుల రాజని యేసుని కొలువండి (2) ఆయన తండ్రి దేవుడు నమ్మండి (2) ||యూదుల||

1వ చరణం

గొల్లలు రక్షకుని గుర్తించిరి - జ్ఞానులు రాజును దర్శించిరి (2) హేరోదు అల్లాడిపోయేను - యేరుశలేము కలవర మొందెను (2) ||యూదుల||

2వ చరణం

రాజువాలె మాట్లాడెను - రారాజువలెనే జీవించెను (2) ప్రకృతి గతినే శాసించెను - సాతనును చిత్తుక త్రోక్కెను (2) ||యూదుల||

3వ చరణం

గాడిదన్ అతిరోహించెను - దీనుడై రారాజు యేతెంచెను (2) జయమణి ప్రజలు హర్షించిరి - జేకరియా ప్రవచనము నేరవేర్చెను (2) ||యూదుల||

4వ చరణం

రాజుగా అవమానమొంధెను - రాజ వస్త్రము ధరించెను (2) సిలువపై రాజని వ్రాయబడెను - త్వరలో రాజుగా వచ్చును (2) ||యూదుల||