TG-5636
Telugu

యోగ్యుడ పరిశుద్ధుడ నీ మహిమలో నున్న శుద్ధులే నీకు

Yoogyuda Parishuddhuda Nee Mahimaloo Nunna Shuddhulee Neeku

17
views
పల్లవి

యోగ్యుడ పరిశుద్ధుడ (నీ)మహిమలో నున్న శుద్ధులే నీకు (2) సాగిలపడి ఆరాధన చేయ నిను నేనే రీతిగ ఆరాధింతును (2) ఆరాధన.... ఆరాధన.... (2) ఎరిగి ఎరిగి నే చేసిన పాపములు నీ పావన కాయమును గాయ పరచగా (2) ఆ గాయాలతోనే స్వస్థతనొసగి ఆ గాయాలతోనే స్వస్థతనొసగి బ్రతికించిన నీకే అర్పణనవుదును నను బ్రతికించిన నీకే అర్పణనవుదును ఆరాధన.... ఆరాధన.... (2) నా గతమెరిగి నీ సేవకు పిలువ బ్రతికించిన నీకే నా బ్రతుకునివ్వక (2) విసిగించిన నన్ను నీ సేవలో నిలిపి విసిగించిన నన్ను నీ సేవలో నిలిపి శాశ్వత ప్రేమకే బానిసవుదును నీ శాశ్వత ప్రేమకే బానిసవుదును ఆరాధన.... ఆరాధన.... (2) ఏ మంచి లేని అయోగ్యుడ నన్ను నమ్మకస్థునిగా ఎంచిన ప్రేమచే (2) నమ్మకమైన నా దాసుడు అనే సాక్షము పొంది ధన్యుడవ్వుదును నే ఆరాధన.... ఆరాధన.... (2) ||యోగ్యుడా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.