TG-1199
Telugu

యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే

yuddhamu yehoovaadee - yuddhamu yehoovaadee

187
views
పల్లవి

యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే (2)

1వ చరణం

రాజులు మనకెవ్వరులేరు శూరులు మనకెవ్వరులేరు సైన్యములకు అదిపతియైన యెహోవా మన అండ (2) ||యుద్ధము యెహోవాదే||

2వ చరణం

వ్యాధులు మనలను పడద్రోసినా భాదలు మనలను కృంగదీసిన విశ్వాసమునకు కర్తయైన యేసయ్య మన అండ (2) ||యుద్ధము యెహోవాదే||

3వ చరణం

యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రం ఎదురైన అద్భుత దేవుడు మనకుండ భయమేల మనకింక (2) ||యుద్ధము యెహోవాదే||

4వ చరణం

అపవాది యైన సాతాను గర్జించు సింహమువలె వచ్చినా యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే (2) ||యుద్ధము యెహోవాదే||