♪♫
TG-4362
Telugu
ఉదయించె దివ్య రక్షకుడ
Udayinche Divya Rakshakudu
0
views
పల్లవి
ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను – (2) ||ఉదయించె||
1వ చరణం
ఘోరాంధకారమున దీపంబు లేక పలు మారు పడుచుండగా (2) దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా (2) మార్గదర్శియై నడిపించువారు (2) ప్రభు పాద సన్నిధికి దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించె ఈ ధరలో – (3) ||ఉదయించె||
2వ చరణం
చింత విచారముతో నిండియున్న లోక రోదన విని (2) పాపంబునుండి నశించిపోగా ఆత్మ విమోచకుడు (2) మానవాళికై మరణంబునొంది (2) నిత్య జీవము నివ్వన్ దివ్యరక్షకుడు ప్రకాశతార ఉదయించె రక్షింపను – (3) ||ఉదయించె||
3వ చరణం
పరలోక తండ్రి కరుణించి మనల పంపేను క్రీస్తు ప్రభున్ (2) లోకాంధులకు దృష్టినివ్వ అరుదెంచె క్రీస్తు ప్రభువు (2) చీకటి నుండి దైవ వెలుగునకు (2) తెచ్చె క్రీస్తు ప్రభువు సాతాను శృంగలములను తెంప ఉదయించె రక్షకుడు – (3) ||ఉదయించె||